: అమెరికాలో హైదరాబాదుకు చెందిన విద్యార్థి అనుమానాస్పద మృతి
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మృతి చెందిన విద్యార్థి పేరు రవితేజారెడ్డి. హైదరాబాద్ ఉప్పల్ కు చెందినవాడు. గత నెల 2వ తేదీన ఉన్నత విద్య కోసం యూఎస్ లోని అక్రాన్ స్టార్ స్పేస్ యూనివర్శిటీకి అతను వెళ్లాడు. రవితేజారెడ్డి స్విమ్మింగ్ చేస్తూ మృతి చెందినట్టు అతని కుటుంబ సభ్యులకు ఈ రోజు సమాచారం అందింది. అయితే, రవితేజ మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించి, ఉన్నత స్థాయికి చేరుకుంటాడనుకున్న రవితేజ దూరమవడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.