: మోదీ, ఒబామాల కోసం హాట్ లైన్... ఇంకా ఒక్కసారి కూడా వాడలేదట!


అత్యంత రహస్యంగా మంతనాలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య అత్యంత సురక్షితమైన హాట్ లైన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రత్యేక ఫోన్ లైన్ కేవలం వీరిద్దరికి మాత్రమే పరిమితం. కాగా, ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ హాట్ లైన్ ను ఇంతవరకూ ఒక్కసారి కూడా ఉపయోగించలేదని ఒబామా ప్రత్యేక కార్యదర్శి పీటర్ ఆర్ లావోయ్ తెలిపారు. ఈ సంవత్సరం జనవరి 26న ఒబామా భారత పర్యటన సందర్భంగా ఈ హాట్ లైన్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. విపత్తులు సంభవించినప్పుడు, యుద్ధాలు జరుగుతూ, సంప్రదాయ ఫోన్ లైన్లు పనిచేయని సమయంలో హాట్ లైన్లో మాట్లాడుకోవచ్చు. ఈ సంభాషణలు అవతలి వ్యక్తికి తప్ప మరెవరికీ చేరవు. 2004లో భారత్, పాకిస్థాన్ ల మధ్య ఓ హాట్ లైన్ ఏర్పాటుకు అంగీకారం కుదరగా, 2010లో చైనా, భారత్ మధ్య ఇదే తరహా లైన్ ఏర్పాటు జరిగింది.

  • Loading...

More Telugu News