: కాఫీ మోతాదు మించితే పక్షవాతం, హార్ట్ అటాకేనట!
తల నొప్పి క్షణాల్లో మటుమాయం కావాలంటే, మనమంతా తొలుత కాఫీనే ఆశ్రయిస్తాం. పొద్దస్తమానం కాఫీ లేనిదే బండి నడవదంటారు కొందరు కాఫీ ప్రియులు. ఇలాంటి వారికి నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ న్యూట్రిషన్ (ఎన్ఓఎన్) తాజాగా విడుదల చేసిన నివేదిక చూస్తే గుండె ఆగినంత పనవడం ఖాయం. ఎందుకంటే, మోతాదు మించనంతవరకు తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించే కాఫీ, మోతాదు మించితే మాత్రం విషంగా మారుతుందట. రోజుకు రెండు కప్పుల వరకైతే సమస్యేమీ లేదంటున్న ఎన్ఐఎన్ నివేదిక, అంతకు మించితే పక్షవాతంతో పాటు గుండె పోటు కూడా రావచ్చని హెచ్చరిస్తోంది. కాఫీ ప్రియులకు కాస్తంత చేదుగా అనిపించినా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.