: ఫేస్ బుక్, ట్విట్టర్లను నెట్టేస్తున్న పింట్ రెస్ట్, ఇన్ స్టాగ్రామ్!


కొత్తగా నెట్ వాడకం మొదలు పెడుతున్నవారిని ఆకర్షించడంలో సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ లు వెనుకబడ్డాయి. ప్రస్తుతం నూతన వినియోగదారులు పింట్ రెస్ట్, ఇన్ స్టాగ్రామ్ లను అధికంగా వాడుతున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గడచిన మూడేళ్లలో ఈ కొత్త సామాజిక మాధ్యమాలకు కస్టమర్ల సంఖ్య రెండింతలు పెరిగిందని ప్యూ రీసెర్చ్ తెలిపింది. 2012లో 15 శాతం కస్టమర్లున్న పింట్ రెస్ట్ ను ఇప్పుడు 31 శాతం మంది ఆదరిస్తున్నారని, అదే సమయంలో 13 శాతం కస్టమర్లున్న ఇన్ స్టాగ్రామ్ వైపు ప్రస్తుతం 28 శాతం మంది చూస్తున్నారని పేర్కొంది. ఇప్పటికీ ఫేస్ బుక్ అతిపెద్ద సోషల్ నెట్ వర్కింగ్ సైట్ గా ఉందని, మహిళల్లో 72 శాతం మంది దీన్నే వినియోగిస్తున్నారని వెల్లడించింది.

  • Loading...

More Telugu News