: అందంలో ప్రపంచం తలదన్నగలదు కానీ...


మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ కిరీటం తాను సొంతం చేసుకోగలనని 20 ఏళ్ల ఆ అందాల ముద్దుగుమ్మ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తాను పోటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిటన్‌కు తోడుగా, భారతీయ సంతతికి చెందిన భామ అయినందుకు మన దేశానికి కూడా పేరు తేనుంది. అదే జరిగితే.. నేహల్‌ భొగైటా సరికొత్త రికార్డుతో ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నట్లే. ఎందుకంటే.. ఆమె బధిర యువతి.

భారత సంతతికి చెందిన బధిర యువతి భొగైటా ఈ నెల 27న మలేసియాలో జరిగే మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ 2013 పోటీలకు వెళ్తోంది. ఆమె విజయం సాధిస్తే గనుక.. ఈ ఘనత సాధించిన తొలి బధిర యువతిగా ఆమె రికార్డు సృష్టించినట్లే.

  • Loading...

More Telugu News