: ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వంతు... ఓటుకు నోటు కేసులో ‘మాగంటి’ గన్ మెన్ ను ప్రశ్నించిన టీ ఏసీబీ


తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసిన ఓటుకు నోటు కేసు దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురిని తమ కార్యాలయానికి రప్పించి విచారించిన ఏసీబీ అధికారులు, నిన్న హైదరాబాదు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గన్ మెన్ రాంబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటుకు నోటు కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలన్న నోటీసులతో నిన్న రాంబాబు ఏసీబీ అధికారుల ముందు హజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా రాంబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు జరిగిన సమయంలో మీ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారు? ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారు? తదితర ప్రశ్నలతో ఏసీబీ అధికారులు రాంబాబును విచారించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News