: ఉగ్రవాద నాయకుడే గెలిచాడు... పాక్ లో సైఫ్ అలీ ఖాన్ సినిమాపై నిషేధం


ముంబయి దాడుల ఘటనకు తానే సూత్రధారినని బాలీవుడ్ సినిమా 'ఫాంటమ్'లో చూపారని, పాకిస్థాన్ లో ఆ సినిమా విడుదలను అడ్డుకోవాలని జమాత్ ఉద్ దవా అధినేత నేత హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అనంతరం లాహోర్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ షాహిద్ బిలాల్ 'ఫాంటమ్' విడుదలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా పాక్ లో ఆగస్టు 28న విడుదల కావాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, ఈ సినిమాలో తననో ఉగ్రవాదిగా చూపారని, పాకిస్థాన్ పైనా విషం చిమ్మే ప్రయత్నం చేశారని హఫీజ్ సయీద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News