: 'నిన్ను చూసి గర్విస్తున్నా పలక్'... నేపథ్య గాయనికి సల్మాన్ ప్రశంసలు!


'నిన్ను చూసి గర్విస్తున్నా పలక్' అంటూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేపథ్య గాయనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. బాలీవుడ్ నేపథ్య గాయని పలక్ ముచ్చల్ సామాజిక స్పృహ కలిగిన యువ గాయని. తన సోదరుడితో కలిసి పలక్ ముచ్చల్ 800 మంది గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్ చేయించింది. 23 ఏళ్ల పలక్ తన సోదరుడు పలాష్ ముచ్చల్ తో కలిసి స్టేజ్ షోలు చేస్తుంది. ఈ షోల ద్వారా వచ్చిన డబ్బును చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం వెచ్చిస్తోంది. వీరిద్దరూ కలిసి ఒంటి చేత్తో 800 మంది నిరుపేద చిన్నారులకు ఆపరేషన్లు చేయించడం సామాన్యమైన విషయం కాదని సల్లూభాయ్ పేర్కొన్నాడు. నిన్ను చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. కాగా, 'ఏక్ థా టైగర్', 'కిక్', 'ఆషికీ-2', 'యాక్షన్ జాక్సన్' సినిమాలకు ఆమె నేపథ్య గాయనిగా సేవలందించారు.

  • Loading...

More Telugu News