: మిత్రుడికి నజరానా... పాకిస్థాన్ లో న్యూక్లియర్ ప్లాంట్ నిర్మిస్తున్న చైనా!


పాకిస్థాన్, చైనా మధ్య సంబంధాలు పటిష్ఠపడుతున్నాయి. పాకిస్థాన్ లో మౌలిక సదుపాయల కల్పనలో పాలుపంచుకుంటూ చైనా ఆ దేశంతో సంబంధాలు బలపరుచుకుంటోంది. తాజాగా పాకిస్థాన్ లోని కరాచీలో 10 బిలియన్ అమెరికన్ డాలర్లతో కరాచీ న్యూక్లియర్ ప్లాంట్-2ను నిర్మించనుంది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని పాక్ అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ లో ఇంధన, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న చైనాతో పాకిస్థాన్ కి ఉన్న బంధం, మరింత బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ న్యూక్లియర్ ప్లాంట్ నిర్మాణాన్ని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. చైనాతో సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News