: పవన్ తో మాకు ఎలాంటి విభేదాలు, భేషజాలు లేవు: మంత్రి ప్రత్తిపాటి
నవ్యాంధ్ర రాజధాని భూసేకరణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య జరిగిన మాటల యుద్ధంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. పవన్ తో తమకు ఎలాంటి విభేదాలు, భేషజాలు లేవన్నారు. భూసేకరణ వల్ల నష్టపోతున్నామని కొందరు పవన్ ను ఆశ్రయించి ఉంటారని చెప్పారు. భూసేకరణ చేయకపోతే సమీకరణకు సహకరించినవారు నష్టపోతారని, రాజధాని చుట్టుపక్కల అభివృద్ధి చెందుతుంటే మధ్యలో ఉన్న భూములను సేకరించకుండా వదిలేస్తే నష్టపోతారు కదా? అని ప్రశ్నించారు. వాస్తవాలు పవన్ కు అర్థమయ్యేలా చెప్పగలమన్న నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు.