: మూడేళ్ల తరువాత భారీ వర్షాన్ని చూసిన ఆ ఊరి వాసులకు ఎంత ఆనందమో!
అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం... గడచిన మూడేళ్లుగా కరవుతో అల్లాడుతోంది. ఈ మూడేళ్లుగా అక్కడ సరైన వర్షం ఒక్కసారి కూడా కురవలేదు. ఆ కరవును తీర్చేంత వర్షం ఒక్కసారిగా కురిసింది. ఒక్క కనగానపల్లి ప్రాంతంలోనే కాదు, అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముత్తుకుంట్ల తల్లి మడుగుల, కొండపల్లి, తగరకుంట తదితర గ్రామాల్లో కుంభవృష్టి కురిసింది. దీంతో పలు చెరువులు నిండిపోయాయి. కుంటలు నీరు నిండి కళకళలాడుతున్నాయి. ఓ చెరువుకు గండి కూడా పడింది. ఈ వర్షాన్ని చూసిన రైతుల కళ్లల్లో ఆనందం తాండవిస్తోంది.