: గాల్లోని విమానం తలుపు ఊడి... నేలమీద గోల్ఫ్ కోర్సులో పడింది


హాలీవుడ్ సినిమాల్లో విమానం తలుపు ఊడిపోతే పెను ప్రమాదం సంభవిస్తుంది. విమానంలోకి గాలి చొచ్చుకుపోయి నానాబీభత్సం సృష్టిస్తుంది. కంట్రోల్ తప్పి కూలిపోతుంది. నార్త్ అమెరికాలో డల్లాస్ నుంచి చార్లొట్టే వెళ్తున్న ఏ-321 అమెరికా ఎయిర్ లైన్స్ విమానం ప్యానెల్ డోర్ ఊడిపోయింది. అలా ఊడిపోయిన డోర్ మౌంట్ హోలీగ్రీన్ మెడోస్ గోల్ఫ్ కోర్సులో పడింది. అయితే, అక్కడ గోల్ఫ్ క్రీడాకారులు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే, ప్యానెల్ డోర్ ఊడిపడిన 20 నిమిషాలకు విమానం క్షేమంగా ల్యాండైంది. అందులో ఆరుగురు సిబ్బంది సహా 146 మంది ప్రయాణికులు ఉన్నారు.

  • Loading...

More Telugu News