: ఆగిన టీటీడీ సర్వర్లు, తీవ్ర నిరాశలో భక్తులు


ఆన్ లైన్ లో శ్రీవెంకటేశ్వరుని ఆర్జిత సేవా టికెట్లను పొందాలని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ఉదయం 9 గంటల సమయంలో వివిధ రకాల సేవలకు సంబంధించిన 5 వేల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులో ఉంచగా, వేల మంది ఒకేసారి లాగిన్ కావడంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో సర్వర్ మొరాయించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి అన్ని టికెట్లూ అయిపోయినట్టు టీటీడీ అధికారిక వెబ్ సైట్ చూపుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం అన్ని రకాల సేవలనూ రద్దు చేశారు.

  • Loading...

More Telugu News