: ఐఎస్ఐఎస్ లో చేరకుండా ఏడుగురిని ఆపాం: ఆస్ట్రేలియా ప్రధాని


ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లో చేరేందుకు దేశం విడిచి వెళ్తున్న ఏడుగురిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తెలిపారు. వారి వివరాలు వెల్లడించేందుకు అంగీకరించని ఆయన, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆస్ట్రేలియాలోని కొందరు యువకులు ఇస్లామిక్ స్టేట్ పట్ల ఆకర్షితులు అవుతున్నారని ఆయన అన్నారు. జీహాదీలుగా మారాలని ప్రయత్నిస్తున్న వారిని, ఇస్లామిక్ స్టేట్ రిక్రూటర్స్ తో సంబంధాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు, వారు దేశం దాటకుండా ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News