: ఆస్ట్రేలియా- భారత్ ఎడ్యుకేషన్ అంబాసిడర్ గా ఆడమ్ గిల్ క్రిస్ట్
భారతదేశంతో విద్యా సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ర్ ను తమ దేశ తొలి అంబాసిడర్ గా ఆస్ట్రేలియా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆ దేశ విద్య, శిక్షణ శాఖ మంత్రి క్రిస్టోఫర్ పైన్ ప్రకటించారు. "ఆస్ట్రేలియా- ఇండియా తొలి ఎడ్యుకేషన్ అంబాసిడర్ గా అడమ్ గిల్ క్రిస్ట్ పేరును ప్రకటించేందుకు నేను సంతోషిస్తున్నా" అని క్రిస్టోఫర్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక విద్యా సంబంధాలు వృద్ధి చెందేందుకు అడమ్ ముఖ్యపాత్ర పోషిస్తాడని అన్నారు.