: చొక్కాలు మార్చేవారు, ఏ చొక్కా వేసుకోవాలో కూడా తెలియనివారా మమ్మల్ని విమర్శించేది?: కేంద్ర మంత్రి వెంకయ్య


ఏపీకి ప్రత్యేక హోదాపై తమను విమర్శిస్తున్న వారికి ఆ నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. "పార్టీలు మారుతూ చొక్కాలు మార్చిన వారు, ఇంకా మారుస్తూనే ఉన్నవారు, ఏ చొక్కా వేసుకోవాలో కూడా తెలియని వారు, మా దగ్గరకు వచ్చి బేరాలు ఆడి వెళ్లిన వారు... ఇలాంటివారా మమ్మల్ని విమర్శించేది?" అంటూ ఆయన మండిపడ్డారు. రాజకీయాలకు వారసత్వం కాదు జవసత్వం కావాలి అంటూ వైకాపా అధినేతను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ ఏడాదిలో ఏపీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని... కొత్త రైల్వే జోన్ ను కూడా ఏపీలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీని కొనియాడుతుంటే... దేశానికి ఏమీ చేయలేని నేతలు మాత్రం ఆయనను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయడమే మోదీ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. దార్శనికత, క్యాలిబర్, క్యారెక్టర్ ఉన్న నేత చంద్రబాబు అంటూ కొనియాడారు.

  • Loading...

More Telugu News