: మోసం కేసులో తెలంగాణ జాగృతి సమితి ప్రతినిధి అరెస్ట్


'తెలంగాణ జాగృతి సమితి' ప్రతినిధి నవీన్ గౌడ్ ను మోసం కేసులో హైదరాబాదు, ఎల్ బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరో వ్యక్తి సాయంతో పలువురి నుంచి నవీన్ భారీగా డబ్బులు వసూలు చేశారు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఎల్ బీ నగర్ పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి సాయం చేసిన మరో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News