: గుంటూరు జిల్లాలో పవన్ కల్యాణ్ ఫోటోకు పాలాభిషేకం


గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోటోకు రైతులు, జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజధానిలో మరోసారి భూసేకరణ చేపట్టనున్న సమయంలో భూసేకరణ చట్టం ప్రయోగించవద్దంటూ ఏపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ లో పవన్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు పవన్ కు పాలాభిషేకం చేశారు.

  • Loading...

More Telugu News