: పూర్తి సోలార్ పవర్ తో కొచ్చి ఎయిర్ పోర్ట్


కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్ట్ ప్రపంచంలోనే సోలార్ పవర్ (సౌర విద్యుత్)తో నడిచే తొలి ఎయిర్ పోర్ట్ గా ఘనతకెక్కింది. విద్యుత్ తో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో సోలార్ తోనే ఈ ఎయిర్ పోర్ట్ లో కార్యకలాపాలన్నీ నడవనున్నాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం విమానాశ్రయంలోని కార్గో కాంప్లెక్స్ కు సమీపంలో మొత్తం 45 ఎకరాల విస్తీర్ణంలో 12 మెగావాట్ల ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ను ఆ రాష్ట్ర సీఎం ఉమెన్ చాందీ ఇటీవల ప్రారంభించారు. ఈ విమానాశ్రయ కార్యకలాపాల నిర్వహణకు రోజుకు 50 నుంచి 60వేల యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ ఎయిర్ పోర్ట్ ను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికను గతేడాదే రూపొందించారు.

  • Loading...

More Telugu News