: ‘హోదా’పై ఏపీ సర్కారు ‘ప్రజాభిప్రాయ’ డాక్యుమెంట్... మోదీకి అందించనున్న చంద్రబాబు


ఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మునికోటి ఆత్మబలిదానం నేపథ్యంలో ఏపీ ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయా పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు సంపూర్ణ మద్దతు పలకడంతో పాటు వినూత్న పద్ధతుల్లో నిరసనలు తెలిపారు. ఇక కేంద్రం కూడా ఏపీకి ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి దాదాపు వచ్చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ రావాలంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి జనం ఏమనుకుంటున్నారన్న విషయాన్ని కేంద్రం ముందుంచేందుకు చంద్రబాబు పకడ్బందీ ప్రణాళికలతో ఢిల్లీ విమానమెక్కనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోదాపై జనాల మనస్సుల్లోని కాంక్షను కేంద్రం ముందు పెట్టేందుకు ఏకంగా 200 పేజీలతో ఓ ప్రత్యేక డాక్యుమెంటునే చంద్రబాబు తయారు చేయించారు. ‘హోదా’పై జనం ఏమనుకుంటున్నారు? ఎంతమేర ఆశ పెట్టుకున్నారు? ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నాయి? అన్న విషయాలను ఏపీ అధికారులు ఆ డాక్యుమెంటులో సమగ్రంగా పొందుపరచారట. ఢిల్లీలో ఈ నెల 25 తర్వాత జరిగే భేటీ సందర్భంగా చంద్రబాబు ఈ డాక్యుమెంటును మోదీకి అందించనున్నారు.

  • Loading...

More Telugu News