: రైలు నుంచి కొన్ని బోగీలు విడిపోయాయి
వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి బోగీలు విడివడ్డ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. కిషన్ ఘడ్ సమీపంలో భోపాల్-జైపూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఇంజన్ నుంచి కొన్ని బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బోగీలు విడివడడంతో అప్రమత్తమైన సిబ్బంది వెనుదిరిగి వెళ్లి విడివడిన బోగీలను కలుపుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదము సంభవించలేదు. అయితే, ఈ మార్గంలో బోగీలు నిలిచిపోవడంతో రెండు గంటలపాటు ఇతర రైళ్ల ప్రయాణానికి అంతరాయం కలిగింది. కాగా, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.