: పెద్దలు పెళ్లి చేశారు...కాపురానికి అధికారులు అంగీకరించడం లేదు


పెద్దలు పెళ్లి చేస్తే, కాపురానికి అధికారులు అంగీకరించడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?...ఆ వివరాల్లోకి వెళితే, తమిళనాడుకు చెందిన సురేష్ కుమార్ అనే యువకుడు ఇటలీకి చెందిన సారా అనే యువతిని ప్రేమించాడు. రెండేళ్లు పెద్దదైన సారాను ఈ మధ్యే తమిళనాడులోని వినియకుడి గుడిలో సంప్రదాయ పద్ధతిలో పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నాడు. అంతవరకు అంతా బాగానే ఉంది. వివాహం తరువాత భార్యను ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టాలనుకున్నాడు సురేష్. దీనికి ఆమెకు లాంగ్ టర్మ్ వీసా కావాలి. దీంతో వీసాకు అప్లై చేయగా, మ్యారేజీ సర్టిఫికేట్ కావాలన్నారు. దీంతో రిజిస్ట్రారు ఆఫీస్ కు దరఖాస్తు చేసుకుంటే వారు అభ్యంతరం చెప్పారు. సారా విదేశీ యువతి కావడం వల్ల ధ్రువపత్రం ఇవ్వడం కుదరదని చెప్పారు. త్వరలో సారా వీసా గడువు ముగుస్తుందని, తరువాత దీర్ఘ కాలం ఉండేందుకు లాంగ్ టర్మ్ వీసా కావాలని, అది కావాలంటే వివాహ ధ్రువపత్రం కావాలని, అధికారుల వల్ల అది కుదరడం లేదని సురేష్ వాపోతున్నాడు.

  • Loading...

More Telugu News