: పదిహేనేళ్ల బాలికపై నెల్సన్ మండేలా మనవడి అత్యాచారం... అరెస్ట్
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దివంగత నెల్సన్ మండేలా మనవడు మబుసో మండేలా (24) పదేహేనేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7వ తేదీన జోహన్నస్ బర్గ్ లోని ఓ రెస్టారెంటులో బాలికపై అతను అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దాంతో పోయిన శనివారం మబుసోను అరెస్టు చేశామని జోహన్నస్ బర్గ్ పోలీసులు తెలిపారు.