: తగ్గిన రూపాయి విలువ, బంగారం, క్రూడాయిల్ ధరలు కూడా!
బుధవారం నాటి బులియన్, ఫారెక్స్ సెషన్లలో విలువైన లోహాల ధరలతో పాటు రూపాయి విలువ కూడా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 25 తగ్గి రూ. 25,983 కు చేరగా, వెండి ధర కిలోకు రూ. 77 తగ్గి రూ. 34,717 వద్దకు చేరింది. ఇదే సమయంలో డాలర్ తో రూపాయి మారకపు విలువ 11 పైసలు తగ్గి రూ. 65.20కు చేరింది. ఇది రెండేళ్ల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. కాగా, భారత క్రూడాయిల్ బాస్కెట్ బ్యారల్ కు 0.57 శాతం పడిపోయి రూ.2,820 వద్ద ట్రేడయింది.