: ఉల్లితో పోటీ పడుతూ కన్నీరు పెట్టిస్తున్న క్యాబేజీ!


ఓవైపు ఉల్లిపాయల ధర రూ. 50 దాటి పరుగులు పెడుతుంటే, ఉల్లికి పోటీగా క్యాబేజీ సైతం పరుగు మొదలు పెట్టింది. "దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిన అన్ని ప్రాంతాల్లో క్యాబేజీ ధరలు పెరిగాయి" అని పుణె కేంద్రంగా కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న రైతు అజయ్ బెల్హేకర్ వ్యాఖ్యానించారు. టోకు ధరల మార్కెట్లో మూడు వారాల క్రితం కిలోకు రూ. 5 నుంచి రూ. 7 వరకూ ఉన్న క్యాబేజీ ధర ఇప్పుడు రూ. 10 నుంచి రూ. 14కు చేరిందని తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో క్యాబేజీలతో పోలిస్తే క్యాలీఫ్లవర్ ధర అధికంగా ఉంటుంది. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కన్నా క్యాబేజీ ధర పెరిగిపోయింది. మహారాష్ట్రలో వివిధ రకాల సలాడ్లు, పకోడీ, చైనీస్ ఫుడ్ వెరైటీల్లో ఉల్లిపాయల వాడకం నిలిపివేసిన వ్యాపారులు క్యాబేజీలను వాడుతున్నారు. కాగా, క్యాబేజీలను ఇండ్లలో వంట నిమిత్తం వాడటాన్ని భారతీయులు, ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు తగ్గించినట్టు తెలుస్తోంది. "క్యాబేజీ వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయన్న రూమర్లతో హోటల్ ఇండస్ట్రీ, రహదార్లపై చిరు వ్యాపారులు మినహా సాధారణ ప్రజలు వాడకం తగ్గించేశారు. చౌకగా లభిస్తున్నందున పేదలు మాత్రమే వాడుతున్నారు" అని సిమ్లా గోబీ అసోసియేషన్ కార్యదర్శి సంజయ్ భగత్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News