: భూమి మీద అంతకు మించిన నరకం లేదంటున్న అభిషేక్ బచ్చన్
కష్టానికి తగ్గ ఫలితం లభించకపోవడం కన్నా నరకం లేదని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ అంటున్నాడు. బాక్సాఫీస్ దగ్గర సినిమా వైఫల్యం చెందితే బాధిస్తుందని తెలిపాడు. సినిమా ఫెయిల్ కాగానే నటులు మాట్లాడడం తగ్గిస్తారని పేర్కొన్నాడు. ఎంత నిబద్ధతతో పని చేసినా సినిమా ఫెయిల్ అయితే ఎలాంటి ఫార్ములా పని చేయదని, నువ్వు ఎవరి కుమారుడివన్నది కూడా గుర్తు రాదని అభిషేక్ తెలిపాడు. ఎన్నో ఆశలతో తీసిని సినిమా బోల్తా పడితే ఆ నరకం అనుభవించడం చాలా కష్టమని పేర్కొన్నాడు. ఆ పలితం తరువాత ప్రపంచం మొఖం చూడాలంటే ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆ ఫలితం మనిషిలోని అంతర్గత సామర్థ్యాన్ని కుంగదీస్తుందని అభిషేక్ అభిప్రాయపడ్డాడు. వైఫల్యానికి కారణాలు వెతికే కన్నా ఫలితాన్ని శిరసావహించడమే మేలని అభిషేక్ తెలిపాడు. కాగా, బాలీవుడ్ లో ఫ్లాప్ హీరోల లిస్టులో అభిషేక్ ది ప్రత్యేకస్థానం, దిగ్గజ నటుడు అమితాబ్, జయాబచ్చన్ ల కుమారుడైన అభిషేఖ్ ఫ్లాపుల హీరోగా బాలీవుడ్ లో ముద్రపడ్డాడు.