: సిరియాలో ప్రఖ్యాత ఆర్కియాలజిస్టును బలిగొన్న ఐఎస్


ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు మరో దారుణానికి ఒడిగట్టారు. సిరియాకు చెందిన ప్రఖ్యాత ఆర్కియాలజిస్టు ఖాలెద్ అల్-అసాద్ (81) ను బలిగొన్నారు. పురాతన పట్టణంగా పేరుగాంచిన పాల్మీరాలో శిరచ్ఛేదం చేసి చంపేశారు. మంగళవారం నాడు టౌన్ మ్యూజియం ఎదుట ఈ ఘాతుకానికి పాల్పడిన ఐఎస్ మిలిటెంట్లు ఆపై మృతదేహాన్ని ఓ చారిత్రక సందర్శన స్థలం వద్ద వేలాడదీశారు. నెల క్రితం అసాద్ ను ఐఎస్ గ్రూపు అపహరించిందని సిరియా న్యూస్ ఏజెన్సీ 'సనా', బ్రిటన్ నుంచి కార్యకలాపాలు నిర్వహించే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపాయి. కాగా, ఈ హత్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారట.

  • Loading...

More Telugu News