: ముగిసిన సువ్రా ముఖర్జీ అంత్యక్రియలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ(74) అంత్యక్రియలు ఢిల్లీలోని లోధీ రోడ్ శ్మశాన వాటికలో ముగిశాయి. ప్రణబ్ ముఖర్జీ, కుమార్తె షర్మిష్ఠా, కుమారులు అభిజిత్, ఇంద్రజిత్ ముఖర్జీలు పాల్గొన్నారు. వారితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తదితరులు అంత్యక్రియలకు హాజరై తుది నివాళులు అర్పించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సువ్రా ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో నిన్న ఉదయం 10.51 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.