: మహీ సతీమణి పాత్రలో కియారా... ధోనీ బయోపిక్ చిత్రంలో చాన్స్ కొట్టేసిన కొత్త భామ
టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ధోనీ పాత్రకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (పీకే ఫేం) ఎంపిక కాగా, ధోనీ భార్య సాక్షి పాత్రకు ఇటీవలే బాలీవుడ్ లో అడుగుపెట్టిన కొత్త భామ కియారా అద్వానీ సెలెక్ట్ అయింది. సాక్షి పాత్రకు చాలా మంది హీరోయిన్లను పరిశీలించామని చెప్పిన నీరజ్, కియారా అయితేనే సరిపోతుందనిపించిందని పేర్కొన్నారు.