: ఇక కొలువుల జాతర... తెలంగాణలో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నేడే నోటిఫికేషన్
కొత్త రాష్ట్రం తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. నేటి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. వివిధ విభాగాల కింద మొత్తం 1,700 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. బీటెక్ విద్యార్హతగా ఉన్న ఈ పోస్టుల భర్తీలో పదేళ్ల గరిష్ఠ వయో పరిమితిని కమిషన్ అమలు చేయనుంది. ఇవి కాకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్ డబ్ల్యూఎస్) లో 756 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసుకునేందుకు ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ)కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.