: చిత్తూరు జిల్లాలో గర్భవతులకు చంద్రన్న సీమంతం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో డ్వాక్రా సంఘాల మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అనిమిగానిపల్లెలో పర్యటించిన ఆయన గర్భిణీ స్త్రీలకు సీమంతం నిర్వహించడం విశేషం. చీర, జాకెట్, అరటిపండ్లు అందించి, ఆపై బొట్టు పెట్టి, అక్షింతలు చల్లి సంప్రదాయబద్ధంగా సీమంతం చేశారు. అక్కడే ఉన్న చిన్నారులకు చాక్లెట్లు పంచి వారిని ఉత్సాహపరిచారు. గర్భవతులకు పౌష్టికాహారం కూడా అందించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీమంతం జరుపుకున్న ఆ గర్భవతులు ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.