: తెలంగాణ ప్రభుత్వానికి బొత్స ప్రశ్న!


'ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్థానంలో సామాన్యుడు ఉండి ఉంటే ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శించి ఉండేవారా?' అని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఓటుకునోటు కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో 22 సార్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేరు ఉందని పత్రికలు పేర్కొన్నాయని అన్నారు. ఈ కేసులో నిందితులు చంద్రబాబు డైరెక్షన్ లోనే పనిచేశారని ఏసీబీ పేర్కొందని ఆయన తెలిపారు. అయినా సరే చంద్రబాబును నిందితుడిగా పేర్కోలేదని ఆయన నిష్ఠూరమాడారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబును దోషిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 20న చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం వెనుక అసలు కారణం ఓటుకునోటు కేసులో విముక్తి కోసమేనని, ప్రత్యేకహోదా కోసం కాదని అన్నారు. 'ప్రధాని మోదీ బీహార్ కు ప్యాకేజీ ప్రకటించారు, అయినా బాబు మౌనంగా ఉన్నార'ని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News