: కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో భారీగా చమురు నిక్షేపాలు


ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ (ఓఎన్జీసీ) కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించింది. తీర ప్రాంతాలైన మల్లేశ్వరం, చిన్న ప్రాండ్రాక, నాగాయలంక, బంటుమిల్లి ప్రాంతాల్లో ఓఎన్జీసీ జరిపిన అన్వేషణలో భారీ చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఓఎన్జీసీ ఇప్పటికే బంటుమిల్లి ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తోంది. 4 బావుల నుంచి రోజుకు 110 మెట్రిక్ టన్నుల చమురును వెలికితీస్తోంది. తాజాగా గుర్తించిన డ్రిల్లింగ్ పాయింట్ల నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నుల చమురు లభ్యమయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News