: బీహార్ కు భారీ ప్యాకేజీ ప్రకటించిన మోదీ


వచ్చే ఏడాది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమయం చూసి ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారీ ప్యాకేజీ ప్రకటించారు. రూ.1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బీహార్ లో ఓ బహిరంగసభలో పాల్గొన్న సందర్భంగా మోదీ వెల్లడించారు. ప్యాకేజీతో బిహారీల దశ దిశ మారతాయని భావిస్తున్నానన్నారు. రైతుల సంక్షేమంతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంతకుముందు బీహార్ లోని ఆరాలో జాతీయ రహదారి ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ అనంతరం నైపుణ్యాభివృద్ధి పుస్తకం విడుదల చేశారు. ఆరా బహిరంగసభలో మాట్లాడుతూ, బీహార్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేస్తామని చెప్పారు. బీహార్ అభివృద్ధికి అదనంగా మరో రూ.40వేల కోట్లు ఖర్చుపెడతామని మోదీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News