: విద్యార్థినుల మృతికి నిరసనగా రేపు కడప బంద్ కు పిలుపునిచ్చిన జగన్
కడప జిల్లాలోని నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థినుల తల్లిదండ్రులను రిమ్స్ ఆసుపత్రి వద్ద వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. విద్యార్థినుల మృతికి నిరసనగా, వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో రేపు కడప బంద్ కు జగన్ పిలుపునిచ్చారు. కడప నగర వాసులు బంద్ కు సహకరించాలని కోరారు. వారి మృతదేహాలకు హైదరాబాద్ లో శవపరీక్ష నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు నారాయణ విద్యాసంస్థల్లో 11 మంది మరణించారని, వారి మృతిపై న్యాయ విచారణ చేయించాలని జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇంతమంది చనిపోతుంటే సీఎం చంద్రబాబుకు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.