: సమయానికి విమానాలు నడిపితే సిబ్బందికి రూ. 10 వేల బహుమతి... ఏఐ బంపరాఫర్!


సరిపడినంత విశ్రాంతి లేదని చెబుతూ, గంటల కొద్దీ విమానాల ఆలస్యానికి కారణమవుతున్న పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లు, ఫ్లయిట్ అటెండెంట్లను సమయపాలన పాటించేలా చూసేందుకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ హజ్ సీజనులో అరబ్ దేశాలకు సరైన సమయానికి విమానాలు నడిపితే విమాన సిబ్బందికి రూ. 10 వేల ప్రోత్సాహకాన్ని ఇస్తామని తెలిపింది. సిబ్బంది లభ్యత, వారు ముందస్తుగా విధుల్లోకి వచ్చేలా చూడటం లక్ష్యంగా ఈ ఆఫర్ ను ప్రకటించినట్టు సంస్థ చైర్మన్ రోహిత్ నందన్ తెలిపారు. ఈ మేరకు ఉద్యోగులందరికీ ఆయన లేఖలు రాశారు. కాగా, ఈ హజ్ యాత్ర సీజనులో ఢిల్లీ, శ్రీనగర్, ముంబై, కొచ్చి, హైదరాబాద్, పనాజి, నాగపూర్ ల నుంచి జెడ్డాకు 230 ప్రత్యేక విమానాలు నడపాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది.

  • Loading...

More Telugu News