: సొంత నియోజకవర్గం చేరుకున్న చంద్రబాబు... ఘనస్వాగతం పలికిన జిల్లా టీడీపీ నేతలు
ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే ఉండి స్థానిక సమస్యలపై బాబు సమీక్ష నిర్వహిస్తారు. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.