: తెలంగాణ ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన ఆదికేశవులనాయుడు కుమారుడు
ఓటుకు నోటు కేసులో మాజీ ఎంపీ ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు తెలంగాణ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన కార్యాలయం ఉద్యోగి విష్ణు చైతన్య కూడా విచారణకు వచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయంలో వారిద్దరినీ అధికారులు విచారిస్తున్నారు. నిన్న (సోమవారం) వారిద్దరికి సీఆర్ పీసీ సెక్షన్ 160 ప్రకారం ఏసీబీ నోటీసులు ఇచ్చి, ఇవాళ విచారణకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.