: 'బాహుబలి' తమిళ వెర్షన్ కు కత్తిరింపులు... తొలగించిన భాగాన్ని ప్రదర్శించరాదని మధురై బెంచ్ ఆదేశం
'బాహుబలి' తమిళ వెర్షన్ లో కుల ప్రస్తావన భాగాన్ని సెన్సార్ బోర్డ్ తొలగించింది. తీసివేసిన సన్నివేశాలను థియేటర్లలో ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జారీ చేసిన ఆదేశాల కాపీని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపాలని సెన్సార్ బోర్డును కూడా కోర్టు ఆదేశించింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకుండా సినిమా ప్రదర్శిస్తే థియేటర్ల యాజమానులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పింది. కాగా సినిమాలో తొలగించిన ఆర్డర్ కాపీని తమకు కూడా పంపాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. తమిళ పులి రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి సి.పెరారివలన్ లతో పాటు ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు పైవిధంగా ఆదేశాలిచ్చింది.