: గిన్నిస్ రికార్డు... 12 గంటల్లో 8 లక్షల 'రెడ్ మీ నోట్ 2'లను ఎగరేసుకుపోయారు!


చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ జియోమీ తాజాగా విడుదల చేసిన 'రెడ్ మీ నోట్ 2' ఫోన్లకు భారీ స్పందన లభించింది. ఫ్లాష్ సేల్ లో భాగంగా 8 లక్షల ఫోన్లను ఆన్ లైన్ మాధ్యమంగా సంస్థ విక్రయించగా, 12 గంటల వ్యవధిలో అన్ని ఫోన్లూ అమ్ముడుపోయాయని, 24 గంటల వ్యవధిలో 20.11 లక్షల రెడ్ మీ ఫోన్ల విక్రయాలు జరిగి సరికొత్త గిన్నిస్ రికార్డు నమోదైందని సంస్థ వివరించింది. ఈ ఫోన్ ను 19వ తేదీన న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఫోన్లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, ఆక్టాకోర్ మీడియా టెక్ హిలియో ప్రాసెసర్, 2 జిబి ర్యామ్ తో లభించే ఫోన్లో 16 జిబి, 32 జిబి వేరియంట్లు ఉన్నాయి. 13/5ఎంపీ కెమెరాలు, ఆండ్రాయిడ్ లాలీపాప్ సిస్టమ్ పై పనిచేసే ఫోన్ బరువు 160 గ్రాములు మాత్రమే.

  • Loading...

More Telugu News