: బ్యాంకాక్ హిందూ దేవాలయం ఎదుట పేలుడు ఘటనలో నిందితుడి గుర్తింపు
నిన్న బ్యాంకాక్ లోని హిందూ దేవాలయం సమీపంలో జరిగిన ఘోర పేలుడు వెనక నిందితుడిని గుర్తించామని జుంటా చీఫ్ ప్రయుత్ చాన్ ఓచా మంగళవారం నాడు తెలిపారు. పేలుడుకు ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించాడని, అతడే నిందితుడని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. థాయ్ లాండ్ ఈశాన్య ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వర్గం 'రెడ్ షర్ట్'కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు వివరించారు. కాగా, ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. సుమారు 100 మందికి పైగా పేలుడు ఘటనలో గాయపడగా, వీరికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఓచా తెలియజేశారు.