: బ్యాంకాక్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


థాయ్ లాండ్ లోని ఓ మందిరం వెలుపల జరిగిన పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పేలుడు ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లోని ఎరవాన్ ఆలయం వద్ద జరిగిన పేలుడు ఘటనలో 15 మంది వరకు ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు దెబ్బతిన్నాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News