: ర్యాగింగ్ ఘటనలో ఏడుగురిపై సస్పెన్షన్ వేటు
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జూనియర్లను వేధింపులకు గురి చేసిన ఏడుగురు సీనియర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ర్యాగింగ్ ను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ర్యాగింగ్ వికృత క్రీడను సమూలంగా నాశనం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా శ్రీవెంకటేశ్వరా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై తీసుకునే చర్యలు ఇతరులకు కనివిప్పు కలిగించేలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.