: ఇక్కడ విమర్శిస్తే సమస్యేమీలేదు... విదేశీ గడ్డపై వద్దు: మోదీకి కాంగ్రెస్ సూచన
ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా గత ప్రభుత్వాలను తూర్పారబడుతున్న ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సోమరితనం మినహా గత ప్రభుత్వాలు తమకు వారసత్వంగా ఇచ్చిందేమీలేదని మోదీ యూఏఈ పర్యటనలో పేర్కొనడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. విదేశీ గడ్డపై అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రధాని కట్టిపెట్టాలని పార్టీ అధికార ప్రతినిధి అఫ్జల్ సూచించారు. ప్రధాని తన హోదాకు తగిన విధంగా నడుచుకోవాలని, స్వదేశంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలపై వ్యాఖ్యలు చేస్తే సమస్యేమీ లేదని, విదేశీ గడ్డపై మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలిపారు. విపక్షాలు ఈ విషయాన్ని పాలన ఆరంభంలోనే లేవనెత్తినా, ప్రధాని అదేమీ పట్టించుకోకుండా దేశ రాజకీయాలను పరాయి గడ్డపై ప్రస్తావించడం సరికాదని అన్నారు.