: రేపు ఉదయం ఉగ్రవాది నవేద్ కు లైడిటెక్టర్ పరీక్షలు


జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడికి తెగబడి, గ్రామస్థులను బందీలుగా పట్టుకుని, చివరికి వారి సాహసానికి పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్ కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు ఎన్ఐఏకు అనుమతినిచ్చింది. సీజీవో కాంప్లెక్స్ లో రేపు ఉదయం 11 గంటలకు పాలీగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కాగా, నవేద్ క్షణానికో రీతిన మాట్లాడుతుండడంతో, అతను చెప్పేవి నిజమా? కాదా? అనేది నిర్ధారించేందుకు ఎన్ఐఏ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనుంది. కసబ్ తరువాత భారత్ కు సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది నవేద్ కావడంతో, అతని నుంచి వీలైనంత సమగ్ర సమాచారం సేకరించే పనిలో ఎన్ఐఏ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని నిర్ధారించేందుకు లై డిటెక్టర్ పరీక్షలు ఉపకరించనున్నాయి.

  • Loading...

More Telugu News