: 'టైగర్ అంబాసడార్'గా సచిన్


క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరో సామాజిక బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. మహారాష్ట్రలో పెద్ద పులుల సంరక్షణ ప్రాజెక్టుకు ప్రచారకర్తగా వ్యవహరించేందుకు అంగీకరించారు. రాష్ట్రంలో పులుల మనుగడ ప్రమాదంలో పడిందని, వాటి రక్షణకు అందరూ నడుం బిగించాలని, ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని మహారాష్ట్ర సర్కారు భావించింది. ప్రజలు ఇలాంటి విషయాల్లో భాగస్వాములవ్వాలంటే వారిని ఆకర్షించగల వ్యక్తులు అవసరమని సర్కారు అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగాంతివార్ పలువురు ప్రముఖులకు లేఖలు పంపారు. ఆయన లేఖకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించి, తన సమ్మతి తెలిపారు. తాజాగా, సచిన్ కూడా ముంగాంతివార్ లేఖకు సానుకూలంగా స్పందించారు. పులుల సంరక్షణకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారకర్తగా వ్యవహరించేందుకు తన అంగీకారం తెలుపుతూ మంత్రికి ఓ లేఖ రాశారు. "ప్రాజెక్ట్ టైగర్ కోసం మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. దీనిపై మిమ్మల్ని కలవనుండడం సంతోషదాయకం. క్రికెట్ ఆడే రోజుల్లో... పులుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు నా టెస్టు సెంచరీల్లో ఒకదాన్ని అంకితమిచ్చాను కూడా" అని సచిన్ తన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News