: దాణా స్కాంలో లాలూకు సుప్రీం నోటీసు


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను దాణా కుంభకోణం వెంటాడుతోంది. ఈ స్కాంలో తాజాగా సుప్రీంకోర్టు ఆయనకు నోటీసు జారీ చేసింది. ఈ కేసులోని ఎఫ్ఐఆర్ లలో నమోదైన అభియోగాలను జార్ఖండ్ హైకోర్ట్ ఉపసంహరించుకోవడంపై సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని ఆధారంగా సుప్రీం నోటీసు ఇచ్చింది. లాలూపై నమోదైన కుట్ర నేరాభియోగాలను గతేడాది నవంబర్ 14న జార్ఖండ్ ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో అప్పట్లో లాలూకు తాత్కాలిక ఉపశమనం లభించింది. వచ్చే ఏడాది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సుప్రీం నోటీసు ఇవ్వడం కీలకంగా మారింది.

  • Loading...

More Telugu News