: బతికే ఉన్నా... బోకో హరామ్ చీఫ్ నేనే!: షెకావ్


ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ బోకో హరామ్ చీఫ్ అబూబకర్ షెకావ్ గాయపడ్డాడని, అతని స్థానంలో మహ్మద్ దావూద్ పగ్గాలు స్వీకరించాడని చాద్ దేశాధ్యక్షుడు ఇద్రిస్ దెబీ పేర్కొనడం తెలిసిందే. కొంతకాలంగా షెకావ్ మీడియాలో కనిపించకపోవడంతో ఆ విషయం నిజమేనని అందరూ భావించారు. మీడియా అయితే షెకావ్ మరణించి ఉంటాడని కథనాలు వెలువరించింది. ఆ కథనాలన్నీ అవాస్తవాలంటూ షెకావ్ తెరపైకి వచ్చాడు. తాను సజీవంగానే ఉన్నానని, బోకో హరామ్ సంస్థ చీఫ్ తానేనని స్పష్టం చేశాడు. "నాస్తిక వాద మీడియా నేను చనిపోయానని, అనారోగ్యం పాలయ్యానని ఇలా ఏదేదో రాసింది. దాని గురించి నేను మాట్లాడలేను. అంతా శుద్ధ అబద్ధం. అదే నిజమైతే నేను ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నాను?" అని షెకావ్ ఐఎస్ఐఎస్ అధినేత బాగ్దాదితో చెప్పినట్టు సైట్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ రిటా కాట్జ్ పేర్కొన్నారు. సైట్ ఇంటెలిజెన్స్ గ్రూపు ప్రపంచంలో ఉన్న తీవ్రవాద సంస్థల కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆన్ లైన్ యాక్టివిటీలపై ఓ కన్నేసి ఉంచుతుంది. దీని చీఫ్ ఇజ్రాయెల్ కు చెందిన విశ్లేషకురాలు రిటా కాట్జ్. తాజాగా, షెకావ్ వివరాలను ఆమె ఆన్ లైన్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News