: వైన్ తాగితే స్థూలకాయం ఖాయం అంటున్న పరిశోధకులు


'రోజూ రెండు పెగ్గుల వైన్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం, గుండె జబ్బులు రావు' అంటూ కొంత మంది తాగుతూ ఉంటారు. అయితే, గుండెజబ్బులు రాకపోవడం మాట అటుంచి, వైన్ తాగడం గుండె జబ్బులకు ఇంకో రకంగా కారణమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు 35 ఏళ్లు పైబడిన ఆరోగ్య వంతులను ఎంచుకున్నారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపుకు వైన్ ఇచ్చారు. మరో గ్రూప్ కి ఇవ్వలేదు. రెండు గ్రూపులకు ప్రతి రోజూ ఎమ్మారై స్కాన్ నిర్వహించేవారు. వైన్ తీసుకుంటున్న గ్రూపు వారి మెదడులో రక్త ప్రసరణ వేగం పెరిగినట్టు పరిశోధకులు గమనించారు. వైన్ ఇచ్చిన అనంతరం రెండు గ్రూపులకు భోజనం పెట్టేవారు. వైన్ తీసుకున్నవారి గ్రూపులో హైపోథలామస్ గ్రంధి ఆహారం నుంచి వచ్చే సువాసనల పట్ల బాగా స్పందించడం గమనించారు. దీంతో వారిలో ఆకలి పెరిగి తినాల్సిన మొత్తం కంటే ఎక్కువ తినడం ప్రారంభించారు. రెండో గ్రూపు పరిమిత భోజనం చేసేది. దీంతో వైన్ తీసుకుంటే గుండె జబ్బులు రాకపోవడం సంగతి అటుంచి, వైన్ తీసుకుంటే అపరిమిత భోజనం చేస్తారని, తద్వారా ఊబకాయం, దాని కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందని ఒబేసిటీ అనే జర్నల్ లో పరిశోధకులు ప్రచురించారు.

  • Loading...

More Telugu News