: రాయలసీమను సస్యశ్యామలం చేయడమే నా లక్ష్యం: చంద్రబాబు


రాయలసీమ వెనుకబడటానికి ఉన్న ప్రత్యేక కారణాలలో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తికాకపోవడం కూడా ఓ కారణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తాను ఇద్దరం ఈ సమస్యపై దృష్టి సారించామని... అయితే గత పదేళ్లుగా ప్రాజెక్టులపై సరైన శ్రద్ధ పెట్టలేదని అన్నారు. కర్నూలు జిల్లాలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడటంతో, కృష్ణా నదిపై ఒత్తిడి పెరుగుతోందని... ఇదే సమయంలో 3వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నాయని... ఆ నీటిని కృష్ణలోకి పంపించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. రాయసీమను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. సీమను ఆదుకోవడానికే పట్టిసీమ ప్రాజెక్టును వాయువేగంతో పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమకు నీళ్లు తెస్తుంటే... దాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News